![]() |
![]() |
.webp)
బుల్లితెర మీద ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అన్షు రెడ్డి. అటు ఢీ షోలో రాజుతో కలిసి చేస్తున్న హంగామాతో బాగా పాపులర్ అయ్యింది అలాగే ఇప్పుడు ఇల్లు - ఇల్లాలు -పిల్లలు అనే సీరియల్ లో నటిస్తోంది. ఆమె రీసెంట్ గా ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టింది. అందులో ఆమె ఎం రాసిందంటే... " నిజం చెప్పాలంటే, తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడలేని నటులను ఎందుకు తెలుగు బిగ్‌బాస్‌లోకి తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. బేసిక్ క్రైటీరియా ప్రకారం కనీసం తెలుగు మాట్లాడ్డం, అర్ధం చేసుకోవడం లాంటివి తెలిసి ఉండాలి. బిగ్‌బాస్‌లోకి రావాలనుకునే చాలా మంది తెలుగు నటులు ఉన్నారు.. ఆ విషయం నాకు పర్సనల్ గా కూడా తెలుసు. కానీ వారిని అసలు పరిగణలోకి తీసుకోవడమే లేదు. ఐతే ఇతర భాషల్లో వస్తున్న బిగ్ బాస్ లోకి ఎంతమంది తెలుగు వాళ్ళను తీసుకున్నారు ? సీరియల్స్ లో, సినిమాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది కానీ అక్కడ డబ్బింగ్ , ప్రామ్ప్టింగ్ అవకాశాలు ఉన్నాయి.
కానీ బిబి విషయంలో అలా కాదు మైక్ ఉంటుంది తప్ప స్క్రిప్ట్ ఉండదు. ఎప్పుడూ మారతారో మన వాళ్ళు?" అంటూ ఘాటుగా ఒక పోస్ట్ ని బిగ్ బాస్ టీమ్ మీద పెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఐతే బుల్లితెర మీద సీరియల్స్ లో కూడా ఈ పరిస్థితి ఉంది. వేరే రాష్ట్రాల నటీనటులను తెచ్చి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ ఇక్కడి వాళ్ళను పట్టించుకోరు అంటూ ఇంటర్వ్యూలలో చాలా సార్లు వాళ్ళ బాధను చెప్పుకుంటూ ఉంటారు.
![]() |
![]() |